Total Pageviews

Friday, May 27, 2011

వింటున్నావా ??

వింటున్నావా ??
నన్ను నన్నులా ఉండనివ్వక నలుగురిలో నన్ను పిచ్చిదాన్ని చేసి ఎవరికీ కనిపించకుండా నాకు మాత్రమే కనిపిస్తావు ..నవ్విస్తావు ..ఎడ్పిస్తావు.. బుజ్జగిస్తావు ..కోపడ్తావు... ఎందుకు ?? నా అనుమతి లేకుండా నా ఉనికి తెలుసుకుని నా పరిస్తుతుల్లోకి ,నా స్తితిగాతుల్లోకి దూరిపోడానికి నీకు అనుమతిని ఎవరిచ్చారు ??
                       అదో అలా నవ్వకు ...అవేవి అడుగుదామనుకున్ననో  అడగకుండానే మర్చి పోతానేమో ... ఆ నవ్వుకు  ఏ మంత్రం నేర్పవు ?? ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది ? మరీ అలా మూతి ముడుచుకోకు విచుక్కున్న కుసుమంలా  నీ పెదాలు నవ్వులు రువ్విస్తుంటేనే అనడంగా వుంటావు .....
                      ఈ మద్య నువ్వు వచ్చిన చాల రోజులకు  ఒంటరితనం వచ్చి నన్ను ప్రశ్నించింది .. ఎప్పుడు నాతో గడుపుతావు అని ? ఏది సమాదానం ఇద్దాము అనేంతలో నువ్వు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డావు ...అప్పుడు దాని మొహం చూడాలి ..పాపం .. దాన్ని చూసి నువ్వు నవ్వుతుంటే ఏమి చేయాలో తెలియక అది వేనుతిరుగుతున్నప్పుడు నువ్వు దానికేదో నష్టం కలిగిస్తున్నట్టు అది వేల్లిపోయిందే ..అయ్యో ఏమని చెప్పాలి .. ఒంటరితనమే కాదు ..నువ్వు వచ్చిన తరువాత అందరు వేసే అపహాస్యపు బాణాలు కూడా నిన్ను దాటి వచ్చేంత ధైర్యం చేయలేక వాళ్ళ వద్దకే తిరిగి వెళ్తుంటే లోలోన ఎంత సంతోసమేసిందో తెలుసా ??
                     నా నవ్వును నువ్వు ఎక్కడ్నుంచి వెతికి తీసుకోచ్చావో కాని అది ఇంత అందంగా  ఎప్పుడు నాకు కనిపించలేదు ... ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళను అని అది నాకు భరోసా ఇస్తుంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు ... నిన్ను నిలద్దీద్దమన్న సాహసం చేయలేక పోతున్న .. ఈ పిచి తనం ఇంత హాయి నిస్తుంటే ఎలా వదలగలను చెప్పూ .. ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్ధమవుతుంది అనే అనుకుంటూ ........ అందుకో నా పిచ్చి తనపు చిరునవ్వు కుసుమం అందుకోవూ ......

1 comment:

  1. మీ బ్లాగ్ చూశానండీ.. చాలా బాగుంది. ముఖ్యముగా ఒకరిని అలా ఊహించుకొని, మదిలోని మాటలని అక్షరబద్ధం చెయ్యటం మరీ బాగా నచ్చేసింది. కీప్ ఇటప్..

    వర్డ్ వెరిఫికేషన్ ని తీసెయ్యండి. అది ఏమాత్రం ఉపయోగపడదు.

    ReplyDelete