Total Pageviews

Sunday, March 20, 2011

కుశలమా ?

కుశలమా ?

ఆగమన్నా అలసటనొదిలి ,ఆగను అన్న కాలానికి సలాం చెప్పి ,పదపద మని అడుగుకు పరుగు నేర్పి ,నేర్పుతో ఓర్పును నీ సొంతం చేసుకొని ప్రతి సవాలుకు "సై" అని చేప్పి , జీవితాన్ని జయ పధం లో నడుపతూ ,నవ్వుతూ  నవ్విస్తూ ,రోజుకో  రంగుతో నలుగురి జీవితం అందమైన ననదనవనం చేస్తున్న మిత్ర రత్నానికి ....!!!!!
      -'కుశలమా ' ? అని అడగాలనుంది ఎందుకంటే నీ స్వరం విని చాలా రోజులవ్తునట్టుంది .
       అస్తమించిన సూర్యుని సాక్షిగా ,ఆ కొండల మాటున నుండి చంద్రుడు నేను పారేసుకున్న జ్ఞాపకాలను ఏరి మూట కట్టి మోసుకొని నిమిషం నిమిషం దగ్గరవ్తుంటే , చేజార్చుకున్న నీ స్వరం కూడా అందులో ఉందేమో అని వెతకలనిపించింది అంత జాలి  చూపులు చూడకు చంద్రమా .... నీ దగ్గర లేకున్నా సరేలే అన్న సమాధానం విన్న తను సానుభూతిని సైతం మేఘాలలో వదిలి ,నా కన్నిటికి వాటిని తోడునివ్వమంది ......
       ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్న

జీవితం లో "ఎన్ని సంతోషాలో,ఎన్ని విజయాలో ",ఎంత నిరుత్సాహం దాని కన్నా అధికమైన ఉత్సాహం ",ఎంత నిస్సహాయత ఎంత ఆత్మ స్థైర్యం ","ఎన్ని సమస్యలు వాటి కన్ని సమాధానాలు ".... ఇలా ఇలా అన్ని వేటికవే ప్రత్యక్షమై నా వ్యక్తిత్వ భావనలకు రంగులద్దుతున్నాయి .. నీకు కనిపిస్తుందో లేదో కానీ నీ పరిచయం నుంచి మొదలై నిన్ను చేజార్చుకున్న క్షణాలు అన్నిటికన్నా ఎంతో అందమైన కళను నా జీవితం అద్దింది .అందమైన జ్ఞాపకం నీ పరిచయమితే ,అశ్రువులను అదుపు చేసుకోలేని జ్ఞాపకం నీ స్నేహాన్ని నేను చేజర్చుకోవటం .ఉదయించే తొలికిరణం తోనే నీకు నా సిఫారసు పంపుదామని సూర్యున్ని అనుమతి అడుగుదామనుకున్న కానీ నీ నిద్ర భంగామైతే దానికి కుడా నేనే కారణమై ఇంకా విసిగిస్తున్నాను అనుకుంటావేమో  అని అడగలేదు .తొలకరి చినుకుకు నా తరపున నీకు మనవి చేయమని నాతో మాట్లాడమని అర్జీ పంపిస్తే  ఏకంగా తుఫానులో నా అర్జీ కాస్త తడిసి ముద్దాయి ఎలాంటి సమాదానం లేకుండానే నా దగరకొచ్చింది . ప్రకృతికున్న  జాలి కూడా నీకు నామీద లేదా ? కానీ మనసు మూలన ఎక్కడో చిన్న ఆశ !! తప్పకుండ నీ మాటను నేను వింటానని .. హృదయ లోతుల్లో చిటికెడు నమ్మకం మళ్ళి నా కోసం నీ పిలుపు వినబడుతుందని ... నమ్మకమే జీవితం అంటారు కదా ... అదే నమ్మకంతో ఎదురుచుస్తూ జ్ఞాపకాల సాక్షిగా ....!!!!
 

ఎందుకిలా ??

ఒక్కసారే ఉన్నపాటున అలా ఆకాశాన్ని తాకినట్టు ... సంతోషపు రెక్కలు కట్టుకొని అంచులు లేని ఉల్లాసపు గగనం లో కేరింతలతో ఎగురుతున్నట్టు ... అడుగు తీసి  అడుగు వేస్తున్నప్పుడు ఒక్క అడుగు లో కొన్ని వందల కిలోల మనసు భారం దిగిపోతున్నట్టు .,, శ్వాసిస్తున్న ప్రతి గాలి అనువు సంతోషాన్ని మస్తిష్కానికి అందిస్తున్నట్టు ..ఏంటో ఏమి అర్దమవ్వటం లేదు .. ఒక్క సారి నన్ను గిల్ల గలవా ? ఇది వాస్తవమేనా ? అని అనుమానం ..!!!
          అవును నిజమే నువ్వు నన్ను కలవడం .. నిజమే నేను నిన్ను తలచిన వెంటనే ప్రస్తిస్పందించడం ... భూమి మీద నడుస్తున్నట్టుగా  లేదు మెత్తని ఆ మేఘాలపై కాలు మోపుతున్నట్టు గా ఉంది .. నన్ను నమ్ము మనసు లేడి పిల్లల్లా అనదపు పసిరికపై -"హద్దులు  ఇక లేవు " అంటూ గంతులు వేస్తూ పరుగేద్తున్నట్టుంది .. ఎదురు చూస్తున్నది దొరికినప్పుడు మనస్సు ఇలా ప్రతిస్పందిస్తుందని ఇప్పుడే తెలుసుకుంటున్నాను .......
          మళ్లీ నీ పలకరింపు నాలో నూతన ఉత్సాహం నింపింది ... మళ్ళి ఆ పిలుపు నా ఒంటరి లోకంలోకి  జొచ్చి నేను ఒంటరిని కాను అనే ధైర్యాన్ని నాకు కలిగించింది ..ఎడారిలో చావు బ్రతుకుల మద్యలో ఆత్మీయత దాహం తీర్చుకోడానికి ప్రయాస పడుతున్న తరుణంలో ఒయస్సిస్సువై నాకు దొరికిన భండాగారం నువ్వు ... జీవిత ప్రయాణం లో  అలసి పోయి ఇక ముందుకు కదలలేను అని సేద తీర్చుకుంటానని వెతుక్కుంటున్న తరునుం లో నన్ను కరుణించి ఆ దైవమే పంపిన స్నేహ కల్పతరువు నువ్వూ...
          ఎలా నీ స్నేహాన్ని వర్ణించాలో కూడా తెలియట్లేదు .. ఎందుకంటే జీవితాభ్యసంలో ఇప్పుడే స్నేహం అనే వర్ణ మాల  వరకు వచ్చాను ,,, ఇంకా ఇలా ఎన్నో అభ్యసించాలి . కానీ ఒకటి మాత్రం చెప్పగలను మిత్రమా ... సంతోషం ఎక్కువైనప్ప్పుడు నోటి వెంట మాటలు రావంటారు .. నా పరిస్థితి అలాగే ఉంది .. ఎలా ఈ సంతోషాన్ని వ్యక్తం చేయాలో కూడా తెలియట్లేదు ....
         ఆకాశంలోని నక్షత్రాలను ఏరి కూర్చి నీకు నా కృతజ్ఞత తెలుపనా ? కానీ కుదరలేదు .. అంటూ ఉంటారు కదా .. చనిపోయిన వాళ్ళు నక్షత్రాలు అవుతారని  అలాగే నేను చనిపోయి నక్షత్రం అయినప్పుడు తప్పకుండ ఆ పని చేస్తా నన్ను నమ్ము ,,!!ఇంకా ఏదో నీకోసం చేయాలనీ,, నీ స్నేహానికి రుణపడ్డ నేను నీ ఋణం తీర్చుకోవాలని ఉంది కానీ ఎంత చేసిన నేను నీ స్నేహం ఋణం విలువ కట్టలేనంత ఉన్నతంగా ఉంది ... అందుకే చెప్తున్నా ఎప్పటికి నీ స్నేహానికి ఋణపడే ఉంటా మన స్నేహం సాక్షిగా ..!!!!!!!!!