Total Pageviews

Sunday, January 15, 2012

మనసు కలం రాసిన ....!!

ఏదో రాయాలన్న తపన రాయడానికి మనసు కలం జ్ఞాపకాల సిరాను నింపుకొని జీవిత పుస్తకాన్ని తెరవమని చెప్తుంటే నా ఆలోచనల అక్షరాలను ఎలా ఏరుకోవాలో అని నేను నీ వైపు చూస్తున్నా ...!!
నువ్వు నా ముందు అద్దమై వుంటే నన్ను అలాగే ప్రతిబింబిస్తే నేనేంటో నాకు తెలియజేస్తుంటే నీపై నాకు కోపం రాకుండా ఎలా ఉండగలదు .. ??
నాకు మౌనమనే స్నేహితుడున్నాడని తెలిసి నీ అల్లరి చెలికత్తెను చేర్చి తనను నీ సొంతం చేసుకున్నపుడే నీ మీద నేను కొపపడవలసింది ..అదో అలా నిన్ను వదిలివేయడమే నేను చేసిన తప్పు కదా.. !
నిశబ్దంలో నిర్వచనాలను వెతుక్కునే నాతో మాటల మాలలు అల్లడం ఎందుకు నేర్పవు .. ? నిశీధిలో నింగిలోని శూన్యాన్ని మాత్రమే చూసే నాతో జాబిలి సొగసులు చూడటం ఎందుకు నేర్పవు ..??
నా ప్రశ్నల మెట్లు ఎక్కి నిన్ను చేరెంతలో ఊహల పుష్పక విమానం ఎక్కి ప్రయాణాలు చేయబోతావ్ .. సమాధానాల స్థానానికి ఎక్కేంతలో అలా ఓ నవ్వు నవ్వి  ఇలా పైకేగబాకుతావ్ ఏమనాలి నిన్ను ??
నీ స్మృతుల గుభాలిమ్పులతో నా మది మస్తిష్కపు తోటలోని చెలియల పూలు నిండిపోతే ఆ మత్తు నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంటే భవిష్యత్తు గమ్యానికి నన్ను చేరమనే నీవు నన్ను పిచ్చిదాన్ని గాక  ఇంకేమి చేస్తున్నావ్ నన్ను ??
నా గతం తాలుకు పాఠాలు నీ దగ్గర వదిలి భవిష్యత్తు పాఠాలను వల్లే వేయాలని ,సాఫల్యత సంపాదించే దిశలో అడుగేస్తున్న నా ప్రస్తుతానికి నువ్వు ఆశల వెలుగులు విరజిమ్మ నివ్వకుండా అడ్డుపడ్తుంటే ?ప్రేమ అనే ఈ రెండు అక్షరాల మధ్య ఎంత దూరం వుందని నువ్వు కొలవమంటే నన్ను నేను వెత్తుక్కొనా ?? ... లేక నాలో నిన్ను వెత్తుక్కొనా ?? లేక నీ కోసం నా అస్తిత్వాన్ని వదిలి నీవై నేను నీలో కలిసిపోనా..?? ... ??

Friday, May 27, 2011

వింటున్నావా ??

వింటున్నావా ??
నన్ను నన్నులా ఉండనివ్వక నలుగురిలో నన్ను పిచ్చిదాన్ని చేసి ఎవరికీ కనిపించకుండా నాకు మాత్రమే కనిపిస్తావు ..నవ్విస్తావు ..ఎడ్పిస్తావు.. బుజ్జగిస్తావు ..కోపడ్తావు... ఎందుకు ?? నా అనుమతి లేకుండా నా ఉనికి తెలుసుకుని నా పరిస్తుతుల్లోకి ,నా స్తితిగాతుల్లోకి దూరిపోడానికి నీకు అనుమతిని ఎవరిచ్చారు ??
                       అదో అలా నవ్వకు ...అవేవి అడుగుదామనుకున్ననో  అడగకుండానే మర్చి పోతానేమో ... ఆ నవ్వుకు  ఏ మంత్రం నేర్పవు ?? ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది ? మరీ అలా మూతి ముడుచుకోకు విచుక్కున్న కుసుమంలా  నీ పెదాలు నవ్వులు రువ్విస్తుంటేనే అనడంగా వుంటావు .....
                      ఈ మద్య నువ్వు వచ్చిన చాల రోజులకు  ఒంటరితనం వచ్చి నన్ను ప్రశ్నించింది .. ఎప్పుడు నాతో గడుపుతావు అని ? ఏది సమాదానం ఇద్దాము అనేంతలో నువ్వు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డావు ...అప్పుడు దాని మొహం చూడాలి ..పాపం .. దాన్ని చూసి నువ్వు నవ్వుతుంటే ఏమి చేయాలో తెలియక అది వేనుతిరుగుతున్నప్పుడు నువ్వు దానికేదో నష్టం కలిగిస్తున్నట్టు అది వేల్లిపోయిందే ..అయ్యో ఏమని చెప్పాలి .. ఒంటరితనమే కాదు ..నువ్వు వచ్చిన తరువాత అందరు వేసే అపహాస్యపు బాణాలు కూడా నిన్ను దాటి వచ్చేంత ధైర్యం చేయలేక వాళ్ళ వద్దకే తిరిగి వెళ్తుంటే లోలోన ఎంత సంతోసమేసిందో తెలుసా ??
                     నా నవ్వును నువ్వు ఎక్కడ్నుంచి వెతికి తీసుకోచ్చావో కాని అది ఇంత అందంగా  ఎప్పుడు నాకు కనిపించలేదు ... ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళను అని అది నాకు భరోసా ఇస్తుంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు ... నిన్ను నిలద్దీద్దమన్న సాహసం చేయలేక పోతున్న .. ఈ పిచి తనం ఇంత హాయి నిస్తుంటే ఎలా వదలగలను చెప్పూ .. ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్ధమవుతుంది అనే అనుకుంటూ ........ అందుకో నా పిచ్చి తనపు చిరునవ్వు కుసుమం అందుకోవూ ......

Tuesday, May 17, 2011

నేల మీద నేను నింగి లోన తాను !! ఇలలోన నన్ను కలవడానికి తను దిగిరాడు !!తలెత్తి చూస్తున్న తన జాలి నాపై కలుగదా అని ? ఏది  ఒక్కసారైనా నా వైపు చూడడే ?? నోరు తెరిచి అడిగితే లోకువవుతనేమో అడగక పోతే అస్సలు తెలుసుకోడేమో ? ఎలా ఈ డోలాయమాన పరిస్థితి ఎంత వరకు ? నా మనసు ఇలా ఊగిసలాడుతుంటే అర్ధం చేసుకోని నిన్ను చూస్తే కోపం కాక ఇంకేమి వస్తుంది ??
అనిపిస్తుంది నాకు నువ్వు మంచి నటుడివే అని !! ఆ నటన నీకు మాత్రమే సాద్యమవ్తుందని .. తెలియని భావనలను నాలో చొప్పించి నా మనసునే నీ ఆధీనం చేసుకుని ఇప్పుడు ఏమి తెలియనట్టు ఆ నటనను చూడు .. 
నొప్పించని  కోపం ..
గాయపరచని శిక్ష ...
బాధించే మౌనం ...
దూరంగా ఉండలేని నీ అమాయకత్వం ..
ఎలా నీ వైపు నుంచి నా తల త్రిప్పేది ???
నిన్ను ఒప్పించే ప్రయత్నం లో నన్ను నేను కోల్పోతనేమో అనే భయం నా మనసును  నొప్పించే నీ మౌనం  నాకు చిరుకోపం తెప్పించే నీ దూరం ఎప్పటికి నాకు దూరమయ్యేను ?? అలా అస్తమించిన సూర్యుని సాక్షిగా నీ వైపు చూస్తున్నా దాక్కున్న ఆ మబ్బుల మాటున నుంచి నీవు బయటికోస్తవేమో అని .. నీవు చూడలేని ఈ కలువ మొహాన నవ్వులు ఎందుకని ? పక్షం రోజులుగా ఎదురుచూస్తున్న నీ పూర్ణ రూపం నాకు సొంతమవాలని ... ఎవరికీ పంచక నీ వెన్నెల చల్లదనం నా పరం చేసుకోవాలని .. జాబిలి అని జానల వెనక తిరిగినా జోల పాట పాడనీ వెన్నల గానమైన నీవు లేక పోతే శున్యమనిపిస్తుంటే ఇంకా ఏమని చెప్పి నిన్ను ఒప్పించేను ?ఎలా చెప్పి నిన్ను కదిలించేను ? కాలం  పరుగెడుతూ తనతో నిన్ను తీసుకెల్లక ముందే నీ కనుల స్పర్శ తాకి కలువలా నేను పరవసించేలా ఒక్కసారైనా ఈ నా వంక చూడవా ??
చక్కని చుక్కలు చక్కగా నిన్ను బందించినా నా చిన్న మనవి ఒప్పుకోలేనంత వ్యాపకాలతో నన్ను మరిచేవా ??

Thursday, May 5, 2011

ఎంత దూరంగా వుంటే సంబంధాలు అంత బలపడతాయి అని పెద్దవాళ్ళు అంటూ వుంటారు కదా,అదేంటో కానీ నాకు అది నిజమే అనిపించింది ఇవ్వాళ.. నేను తీసుకున్న నిర్ణయం సరియినదేనా కాదా? అని ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది ... నా skills ఆ లేక సేవా ? నన్ను నేను prove చేసుకోవడమా ? లేక comfortzone లో నే ఉండి పోవాలా ? ఏమి అర్ధమవడం లేదు ... feeling like why i say yes when i should say NO ?? looking at GOD now he should help me ... కొండల తట్టు నా కన్ను లెత్తు చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ? యెహోవ వలననే నాకు సహాయం కలుగును అని !! let me wait and see for the will of GOD .......................

Tuesday, April 26, 2011

నిజమే అనిపిస్తుంది .. కొన్ని సార్లు ఎందుకు కొన్ని విషయాలు మన జీవితం లో జరగడానికి సమయం తీస్కుంటాయి అని .. కానీ నిజమే భూమి మీద జరిగే ప్రతి దానికి సమయం వుంటుంది అని బైబిల్ లో రాసి వున్నట్టు , దేవుడు ఏ సమయం లో ఏది అవసరమో అది ఆ సమయం లోనే దేవుడు మనకి విడుదల చేస్తాడని ... మన కంటికి కనబడనివి మన హృదయానికి గోచరం కానివి ,చెవులకి వినబడనివి దాచియుంచి మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు వాటిని బహిర్గతం చేస్తాడని అర్దమవ్తుంది ఇప్పుడిప్పుడే ... 
ఎన్నో సార్లు ఓపిక లేదని చేతులెత్తేసే సమయం లో తెలియకుండానే ఆయన ఆపన్న హస్తం నన్ను ఆదుకుంటుందని గ్రహింపుకు వచినప్పుడు ఒక్కసారి ఆ ఆదరనకు తల వంచి నమస్కరించకుండా ఎలా ఉండగలను.. 
ఎప్పుడో మనసులో అనుకోని ప్రార్దించి వదిలేసాను అది ఆయన గుర్తుంచుకొని మరి ఇప్పుడు నాకు దయచేయడం చూస్తుంటే ఆయన అరచేతిలో నన్ను చెక్కు కున్నాడు అన్న మాట నిజమనిపిస్తుంది .. స్తుతి మహిమ ఘనత ఆయనకే ...

Sunday, March 20, 2011

కుశలమా ?

కుశలమా ?

ఆగమన్నా అలసటనొదిలి ,ఆగను అన్న కాలానికి సలాం చెప్పి ,పదపద మని అడుగుకు పరుగు నేర్పి ,నేర్పుతో ఓర్పును నీ సొంతం చేసుకొని ప్రతి సవాలుకు "సై" అని చేప్పి , జీవితాన్ని జయ పధం లో నడుపతూ ,నవ్వుతూ  నవ్విస్తూ ,రోజుకో  రంగుతో నలుగురి జీవితం అందమైన ననదనవనం చేస్తున్న మిత్ర రత్నానికి ....!!!!!
      -'కుశలమా ' ? అని అడగాలనుంది ఎందుకంటే నీ స్వరం విని చాలా రోజులవ్తునట్టుంది .
       అస్తమించిన సూర్యుని సాక్షిగా ,ఆ కొండల మాటున నుండి చంద్రుడు నేను పారేసుకున్న జ్ఞాపకాలను ఏరి మూట కట్టి మోసుకొని నిమిషం నిమిషం దగ్గరవ్తుంటే , చేజార్చుకున్న నీ స్వరం కూడా అందులో ఉందేమో అని వెతకలనిపించింది అంత జాలి  చూపులు చూడకు చంద్రమా .... నీ దగ్గర లేకున్నా సరేలే అన్న సమాధానం విన్న తను సానుభూతిని సైతం మేఘాలలో వదిలి ,నా కన్నిటికి వాటిని తోడునివ్వమంది ......
       ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్న

జీవితం లో "ఎన్ని సంతోషాలో,ఎన్ని విజయాలో ",ఎంత నిరుత్సాహం దాని కన్నా అధికమైన ఉత్సాహం ",ఎంత నిస్సహాయత ఎంత ఆత్మ స్థైర్యం ","ఎన్ని సమస్యలు వాటి కన్ని సమాధానాలు ".... ఇలా ఇలా అన్ని వేటికవే ప్రత్యక్షమై నా వ్యక్తిత్వ భావనలకు రంగులద్దుతున్నాయి .. నీకు కనిపిస్తుందో లేదో కానీ నీ పరిచయం నుంచి మొదలై నిన్ను చేజార్చుకున్న క్షణాలు అన్నిటికన్నా ఎంతో అందమైన కళను నా జీవితం అద్దింది .అందమైన జ్ఞాపకం నీ పరిచయమితే ,అశ్రువులను అదుపు చేసుకోలేని జ్ఞాపకం నీ స్నేహాన్ని నేను చేజర్చుకోవటం .ఉదయించే తొలికిరణం తోనే నీకు నా సిఫారసు పంపుదామని సూర్యున్ని అనుమతి అడుగుదామనుకున్న కానీ నీ నిద్ర భంగామైతే దానికి కుడా నేనే కారణమై ఇంకా విసిగిస్తున్నాను అనుకుంటావేమో  అని అడగలేదు .తొలకరి చినుకుకు నా తరపున నీకు మనవి చేయమని నాతో మాట్లాడమని అర్జీ పంపిస్తే  ఏకంగా తుఫానులో నా అర్జీ కాస్త తడిసి ముద్దాయి ఎలాంటి సమాదానం లేకుండానే నా దగరకొచ్చింది . ప్రకృతికున్న  జాలి కూడా నీకు నామీద లేదా ? కానీ మనసు మూలన ఎక్కడో చిన్న ఆశ !! తప్పకుండ నీ మాటను నేను వింటానని .. హృదయ లోతుల్లో చిటికెడు నమ్మకం మళ్ళి నా కోసం నీ పిలుపు వినబడుతుందని ... నమ్మకమే జీవితం అంటారు కదా ... అదే నమ్మకంతో ఎదురుచుస్తూ జ్ఞాపకాల సాక్షిగా ....!!!!
 

ఎందుకిలా ??

ఒక్కసారే ఉన్నపాటున అలా ఆకాశాన్ని తాకినట్టు ... సంతోషపు రెక్కలు కట్టుకొని అంచులు లేని ఉల్లాసపు గగనం లో కేరింతలతో ఎగురుతున్నట్టు ... అడుగు తీసి  అడుగు వేస్తున్నప్పుడు ఒక్క అడుగు లో కొన్ని వందల కిలోల మనసు భారం దిగిపోతున్నట్టు .,, శ్వాసిస్తున్న ప్రతి గాలి అనువు సంతోషాన్ని మస్తిష్కానికి అందిస్తున్నట్టు ..ఏంటో ఏమి అర్దమవ్వటం లేదు .. ఒక్క సారి నన్ను గిల్ల గలవా ? ఇది వాస్తవమేనా ? అని అనుమానం ..!!!
          అవును నిజమే నువ్వు నన్ను కలవడం .. నిజమే నేను నిన్ను తలచిన వెంటనే ప్రస్తిస్పందించడం ... భూమి మీద నడుస్తున్నట్టుగా  లేదు మెత్తని ఆ మేఘాలపై కాలు మోపుతున్నట్టు గా ఉంది .. నన్ను నమ్ము మనసు లేడి పిల్లల్లా అనదపు పసిరికపై -"హద్దులు  ఇక లేవు " అంటూ గంతులు వేస్తూ పరుగేద్తున్నట్టుంది .. ఎదురు చూస్తున్నది దొరికినప్పుడు మనస్సు ఇలా ప్రతిస్పందిస్తుందని ఇప్పుడే తెలుసుకుంటున్నాను .......
          మళ్లీ నీ పలకరింపు నాలో నూతన ఉత్సాహం నింపింది ... మళ్ళి ఆ పిలుపు నా ఒంటరి లోకంలోకి  జొచ్చి నేను ఒంటరిని కాను అనే ధైర్యాన్ని నాకు కలిగించింది ..ఎడారిలో చావు బ్రతుకుల మద్యలో ఆత్మీయత దాహం తీర్చుకోడానికి ప్రయాస పడుతున్న తరుణంలో ఒయస్సిస్సువై నాకు దొరికిన భండాగారం నువ్వు ... జీవిత ప్రయాణం లో  అలసి పోయి ఇక ముందుకు కదలలేను అని సేద తీర్చుకుంటానని వెతుక్కుంటున్న తరునుం లో నన్ను కరుణించి ఆ దైవమే పంపిన స్నేహ కల్పతరువు నువ్వూ...
          ఎలా నీ స్నేహాన్ని వర్ణించాలో కూడా తెలియట్లేదు .. ఎందుకంటే జీవితాభ్యసంలో ఇప్పుడే స్నేహం అనే వర్ణ మాల  వరకు వచ్చాను ,,, ఇంకా ఇలా ఎన్నో అభ్యసించాలి . కానీ ఒకటి మాత్రం చెప్పగలను మిత్రమా ... సంతోషం ఎక్కువైనప్ప్పుడు నోటి వెంట మాటలు రావంటారు .. నా పరిస్థితి అలాగే ఉంది .. ఎలా ఈ సంతోషాన్ని వ్యక్తం చేయాలో కూడా తెలియట్లేదు ....
         ఆకాశంలోని నక్షత్రాలను ఏరి కూర్చి నీకు నా కృతజ్ఞత తెలుపనా ? కానీ కుదరలేదు .. అంటూ ఉంటారు కదా .. చనిపోయిన వాళ్ళు నక్షత్రాలు అవుతారని  అలాగే నేను చనిపోయి నక్షత్రం అయినప్పుడు తప్పకుండ ఆ పని చేస్తా నన్ను నమ్ము ,,!!ఇంకా ఏదో నీకోసం చేయాలనీ,, నీ స్నేహానికి రుణపడ్డ నేను నీ ఋణం తీర్చుకోవాలని ఉంది కానీ ఎంత చేసిన నేను నీ స్నేహం ఋణం విలువ కట్టలేనంత ఉన్నతంగా ఉంది ... అందుకే చెప్తున్నా ఎప్పటికి నీ స్నేహానికి ఋణపడే ఉంటా మన స్నేహం సాక్షిగా ..!!!!!!!!!